Listen to this article

జనంన్యూస్. 18.నిజామాబాదు.

ఇందూర్ నగరం : 18 జులై నుండి 24 జులై వరకు భూమారెడ్డి కన్వెన్షన్లో ప్రముఖ ధార్మిక గురువు, ఆచార్య మహామండలేశ్వర శ్రీ స్వామి అవధేశానంద గిరిజీ మహారాజ్ గారిచే బోధించబడుతున్న శ్రీమద్ భగవత్ కథ కార్యక్రమానికి ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు ప్రముఖ ధార్మిక గురువు, ఆచార్య మహామండలేశ్వర శ్రీ స్వామి అవధేశానంద గిరిజీ మహారాజ్ వారి ఆధ్వర్యంలో భక్తిమయంగా శ్రీమద్ భగవద్గీత ప్రవచనం జరిగిందన్నారు. సమస్త మానవాళికి ఆధారం అయినా భగవద్గీత శ్లోకాల సారాన్ని,గీతా బోధనల ప్రాముఖ్యతను, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని, ధర్మాన్ని అర్థమయ్యే విధంగా స్వామీజీ స్పష్టంగా వివరిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేశారన్నారు. గీత యొక్క ప్రాముఖ్యతను భవిష్యత్తు తరాలకు అందించాలని అన్నారు ముఖ్యంగా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పవన్ కుమార్, సుశీల్ కుమార్ కేడియాగార్లను అభినందించారు