Listen to this article

జనం న్యూస్ 19 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం పట్టణ పరిధి రెండవ డివిజన్‌లో మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో బాబు పూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. చంద్రబాబు సూపర్‌ సిక్స్‌, మరిఎన్నో పథకాలు అమలు చేస్తామని చెప్పి ఒక సంవత్సరం కాలం అయిపోయిన సరే హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని కోలగట్ల ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ శ్రావణి, తదితర పట్టణ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.