Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 26 (జనం న్యూస్):- క్యారెట్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలిసిందే. ఆ జాబితాలోకి మరో ప్రయోజనమూ చేరింది. అదేంటంటే టైప్‌-2 డయాబెటిస్‌ను అదుపు చేయడంలో క్యారెట్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. టైప్‌-2 డయాబెటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే గుండెజబ్బులూ, కిడ్నీ సమస్యలూ, చూపు తగ్గిపోవడం వంటి అనారోగ్యాలు తలెత్తుతాయని, క్యారెట్ తరచూ తినడం వల్ల వీటి బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు తెలుపుతున్నారు.