

జనం న్యూస్ జూలై 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోన మండలం , కాట్రేనికోన గ్రామ సర్పంచ్ గంటి సుధాకర్ అధ్యక్షతన మావుళ్ళమ్మ గుడి దగ్గర నుంచి శనివారం ఉదయం ప్రారంభమైన స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ జరిగింది. అందులో భాగంగానే రోడ్ ఇరువైపులా ఉన్న కిరాణా, ఫాన్సీ బ్రాందీ షాపులు లను సందర్శించి ప్లాస్టిక్ వాడకం పై అవగాహనా కల్పించారు గ్రామంలో పూర్తిగా ప్లాస్టిక్ చంచుల వాడకాన్ని తగ్గించాలని షాప్ కి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయుటకు వచ్చే అందరికి ఇంటి వద్ద నుండే చేతితో చంచులు వెంట తీసుకుని వచ్చేలా చెప్పాలని షాప్ యజమానులకు తెలియజేసారు. మన గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చి గ్రామాన్ని ఆరోగ్య గ్రామంగా తీర్చి దిద్దుటారని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్ చలం, తాసిల్దార్ సుబ్బలక్ష్మి వీఆర్వోలు పంచాయతీ కార్యదర్శి జి వి సత్యనారాయణ పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

