

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 26 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా గిద్దలూరు లోని పాండు రంగారెడ్డి నగర్ లో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంటిలోకి చొరబడి రూ. 5 వేలు నగదు.నగదు, వెండి వస్తువులువస్తువులు, ఇంటిలోని వస్తువులను దొంగిలించి తీసుకువెళ్లారు. ఇంటి యజమాని లేని సమయంలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయాన్నే ఇంటికి వచ్చిన ఇంటి యజమాని దొంగలు పడ్డారని గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.