Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 26 (జనం న్యూస్):- పొదిలి మండలం ఆముదాల పల్లిలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లోని రాగి వైరును గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. రైతు పోలిరెడ్డి తన పొలంలోని ట్రాన్స్ ఫార్మర్ లో రాగి వైరు దొంగిలించాలని విద్యుత్ శాఖ అధికారులకు రైతు ఫిర్యాదు చేశాడు. అక్కడికి వెళ్లి పరిశీలించిన విద్యుత్ శాఖ అధికారులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.