Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 19 రిపోర్టర్ సలికినీడి నాగు

సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు ఎర్రజెండా పోరాటం

సీపీఐ ప‌ల్నాడు జిల్లా కార్య‌ద‌ర్శి ఎ మారుతీ వ‌ర‌ప్ర‌సాద్, షేక్ హుస్సేన్

వేలూరు గ్రామ మ‌హాస‌భ‌ నిర్వ‌హ‌ణ‌ చిల‌క‌లూరిపేట‌: పేద ప్రజలు, కార్మికులు, అణగారిన వర్గాల వారి కోసం అండ‌గా నిలిచే పార్టీ సీపీఐ అని ఆ పార్టీ ప‌ల్నాడు జిల్లా కార్య‌ద‌ర్శి ఎ మారుతీ వ‌ర‌ప్ర‌సాద్ చెప్పారు. మండ‌లంలోని వేలూరు గ్రామంలో సీపీఐ 20వ‌ గ్రామ మ‌హాస‌భ‌ను శ‌నివారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధిగా హాజ‌రైన ఆయ‌న మాట్లాడుతూ సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు, ప్రజల పక్షాన ఎర్రజెండా పోరాడుతుందని వివ‌రించారు. నిరంతరం పేద, బడుగు, బలహీన వర్గాలు, కార్మిక కర్షకుల కోసం నేటికీ అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలో సభ్యులమై ఉండడం మన యొక్క గర్వకారణం అని,ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టులుగా సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయం దురాక్రమణలపై పోరాటం చేయాలని, అప్పుడే నిజమైన కమ్యూనిస్టుని తెలియజేశారు.కార్మికులు కర్షకులు హక్కుల గూర్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.సీపీఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్ మాట్లాడుతూ దేశం కోసం, దేశ ప్రజల కోసం జరిగిన అనేక ప్రజా ఉద్యమాలను భార‌త‌క‌మ్యూనిస్టు పార్టీ ముందుండి నడిపిందని, పెట్టుబడిదారి విధానానికి, దోపిడీకి, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించి కార్మిక కర్షక ప్రజా శ్రేయస్సు కోసం నిరంత‌రం పాటుప‌డుతోంద‌ని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని వెల్ల‌డించారు. దేశ వ్యాప్తంగా ప్రతి మూడేళ్లకు ఒకసారి కమ్యూనిస్టు పార్టీ మహాసభలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. దీనిలో భాగంగా శాఖ, మండల, జిల్లా మహాసభలు జరుపుకుంటామన్నారు. ఇప్పటికే జిల్లాల్లోని శాఖలు మండల పట్టణ నియోజక వర్గ జిల్లాల మహాసభలు కొన్ని పూర్తి అయ్యాయని చెప్పారు. ఈ సంద‌ర్బంగా గ్రామ పార్టీ కార్యదర్శిగా ఎలికా శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిగా ఉట్ల వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు. కార్య‌క్ర‌మంలో సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్య‌ద‌ర్శి తాళ్లూరి బాబురావు, ఇన్‌చార్జి స‌హాయ కార్య‌ద‌ర్శి ధ‌న‌రాజ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్య‌ద‌ర్శి షేక్ సుభాని, ఏఐటీయూసీ ఏరియా కార్య‌ద‌ర్శి దాస‌రి వ‌ర‌హాలు, సర్పంచ్ తిరుపతయ్య, నాయ‌కులు కందిమళ్ల‌ వెంకటేశ్వర్లు, , బొంత సుబ్బారావు, బొంత కోటేశ్వరరావు, చౌటుపల్లి నాగేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.