

జనం న్యూస్ జనవరి 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కె. పి. హెచ్.బి ఒకటవ రోడ్ లో గాంధీ విగ్రహము మరియు కె. పి. హెచ్.బి మెయిన్ రోడ్ ఆటో స్టాండ్ మరియి హైదరనగర్ బస్సు స్టాప్ దగ్గర వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు బాలాజీ నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష బాబురావు నియోజకవర్గ కో ఆర్డినేటర్ సతీష్ అరోరా పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా స్వతంత్రం సాధించుకున్నామని ..అలాగే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం రోజు దేశమంతా మువ్వన్నెల పతాకం తో రెపరెపలాడించి.. రాజ్యాంగం రూపొందించిన అంబేద్కర్ వంటి మహానుభావులు కృషిని భావితరాలకు తెలిసేలా చేయాలని పిలుపునిచ్చారు…