Listen to this article

జనం న్యూస్ జూలై 20:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన బక్కూరి జనార్దన్ (48) ఒమాన్ దేశంలోని బురైమి సిటీ మున్సిపాలిటీలో పని చేస్తున్నాడు. జూలై 10నడాంప్యాడ్ డ్యూటీ ఉండుట వలన డంపు వద్దకు కంపెనీ బైక్ పై పోతుండగా మార్గ మధ్యలో అతివేగంగా వచ్చిన కారుఅతన్ని డీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
కంపెనీ మరియు ప్రవాస భారతీయుల సహకారంతోజనార్దన్ మృతదేహాన్నినేడు స్వగ్రామానికి తీసుకువస్తున్నారు. మృతునికి భార్య లలిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబం దుఃఖంలో మునిగిపోయారు. గ్రామ ప్రజలు వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల ఆర్తనాదాలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం పేద కుటుంబం నకు తక్షణమే ఆర్థిక సహాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరారు.