Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండలం 89వ బూతు పరిధిలో మర్రిపల్లి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు సూచన మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతోనే ఉంటామని ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తామని అన్నారు. అధికారం లోకి వచ్చిన సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని,భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తు న్నాము అన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మణికంఠ,రమేష్, చరణ్ ,మోహన్,రాము తదితరులు పాల్గొన్నారు