Listen to this article

జనం న్యూస్: జనవరి 26 ఆదివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;స్థానిక భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో పిల్లలు వివిధ వేషధారణలో అలరించారు.గణతంత్ర దినోత్సవం సందర్భముగా పాఠశాలలో జరిగిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమములో పాఠశాల కరెస్పాండంట్ లిఖిత,ఉపాధ్యాయినులు రత్నమాల,దేవిక,కావేరి, భరతమాత,రక్షిత,భారతి,వాణిశ్రీ,మానుష పాల్గొన్నారు.