

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నల్ల తిమ్మాయ పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నందలూరు మండలం అన్నమయ్య జిల్లా,విద్యార్థుల కోరిక మేరకు కుప్పాల రామకృష్ణయ్య.రిటైర్డ్ ఎల్ ఎఫ్ ఎల్ హెడ్మాస్టర్,ఎగువ రెడ్డిపల్లి, పుల్లంపేట మండలానికి చెందిన మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఈరోజు కంప్యూటర్ వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం అందరికీ అవసరమని ఇది విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ ని ఉపాధ్యాయ విద్యార్థుల బృందం ఘనంగా సన్మానించడమైనది.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం మ. బి వెంకటేశ్వర్లు చంద్రశేఖర్ రఘు ప్రసాద్ నిత్య పూజయ్య సాహెబ్ జాన్ సుభాయతుల్లా మరియు అయేషా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.