

జనం న్యూస్ 26 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :-నాయకులారా…అభివృద్ధికి దూరంగా నెట్టు వేయబడుతున్న ప్రజల వైప..ప్రజల సమస్యలను గాలికి వదిలేసి అవినీతికి పాల్పడుతూ కోట్ల రూపాయల సంపాదిస్తున్న కౌన్సిలర్ల వైప..ఐజ మున్సిపాలిటీ లో అవినీతి అక్రమాలకు పాల్పడిన కౌన్సిలర్లను సన్మానం చేయడం న్యాయమేనా…ఐజ మున్సిపాలిటీకి 36 మంది కమిషనర్లను బెదిరించి భయపెట్టి ఇక్కడ ఉండి ట్రాన్స్ఫర్ చేసిన చరిత్ర కౌన్సిలర్లకు ఉన్నది వారికి సన్మానం చేయడం మీరు ఆలోచిస్తున్న సమాజం మార్పు అవినీతిని ప్రోత్సహించడం వలనే ప్రజల అభివృద్ధి జరిగినట్లేనా…ఒక వ్యక్తి చెప్పే ఆలోచన మాటల ద్వారా కౌన్సిలర్లకు సన్మానం చేయడం అంటే అఖిలపక్ష కమిటీకి ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి కోల్పోతున్నారు.శ్రామిక ప్రజల నుండి అవినీతికి పాల్పడిన వ్యక్తి ఆలోచన స్వార్థం కోసం మరోసారి కౌన్సిలర్లుగా గెలవడానికి వారు చెప్పినట్టు సన్మానం చేయడం ఏమిటి అఖిలపక్ష కమిటీ నిర్ణయాలు…ఐజ మున్సిపాలిటీ ప్రాంతంలో శ్రామిక ప్రజల కార్మికుల పట్ల అభివృద్ధికి మీకు చిత్తశుద్ధి ఉన్నదా..ఐజ మున్సిపాలిటీ పరిధిలో ప్రజల ఓట్లతో గెలిచిన కౌన్సిలర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలకు సరైన కనీస అవసరాలు తీర్చే లేకుండా కోట్ల రూపాయలు నిధులను కాగితాల మీద అభివృద్ధి జరిగింది కానీ ప్రజలకు ప్రజా సమస్యలకు నిజమైన అభివృద్ధి జరగలేదు. అలాంటి కౌన్సిలర్లకు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో అవినీతి కౌన్సిలర్లకు సన్మానం చేయడం అంటే ప్రజల కోసం అని చెబుతున్న అఖిలపక్ష కమిటీ కొంతమంది స్వార్థపూరితమైన ఆలోచన విధానాలను వారి అవసరాల కోసం తీర్చడానికి ఐజ అఖిలకపక్ష కమిటీ ఏర్పడిందని ఐజ మున్సిపాలిటీ ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజంగా మీకు ఐజ మున్సిపాలిటీ పై ప్రేమ అభిమానం ప్రజల అభివృద్ధికి ఆకాంక్షిస్తున్న నాయకులైతే ప్రతి వార్డును తిరిగి ప్రజలను నిజాలను తెలుసుకొని ఇక్కడ కౌన్సిలర్ జరిగిన అభివృద్ధి ఎలా ఉన్నది. ప్రజల సమస్యలు నిజాయితీగా చిత్తశుద్ధిగా పరిష్కరించారా ఓట్లు వేసిన ప్రజలకోసం పనిచేశారా లేకుంటే శ్రామిక ప్రజల నుండి అవినీతికి పాల్పడి నిజమైన సమస్యలు పరిష్కరించకుండా బెదిరింపులకు పాల్పడ్డారా ప్రజల నుండి నిజాలు సేకరించకుండా కౌన్సిలర్లను సన్మానం చేయడం అంటే వారు చేస్తున్న అవినీతి అక్రమాలకు ఐజ అఖిలపక్ష కమిటీ నాయకులకు వాటాలు కమిషన్లు అందుతున్నాయని ఐజ మున్సిపాలిటీ ప్రజలు ఆలోచిస్తున్నారు.రియల్ ఎస్టేట్ పేరు మీద శ్రామిక ప్రజల నుండి కోట్ల రూపాయలు శ్రమ చేయకుండా అక్రమంగా సంపాదించుకొని ఆ ఆడబ్బులతో గౌరవ అధ్యక్షులుగా పేరు తెచ్చుకుంటూ మరోసారి కౌన్సిలర్ల గెలవడానికి అఖిలపక్ష కమిటీ వరంలో ఆయన పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లను సన్మానం చేయిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఆలోచన విధానాలను సమర్థించడం అంటే మున్సిపాలిటీ కార్మికులను ప్రజలను మోసం చేయడమే దగా చేయడమే అఖిలపక్ష కమిటీ నాయకులారా.. మీకు చిత్తశుద్ధి ఉంటే కార్మిక ప్రజలను అభివృద్ధి కోసం వారి శ్రమిస్తున్న ప్రజల అభివృద్ధి పట్ల పోరాటం చేయాలి కానీ అవినీతి కౌన్సిలర్లను సన్మానం చేయడం ఇది ప్రజా వ్యతిరేక విధానమే…?? మున్సిపాలిటీ ప్రజల సమస్యల అందరికోసం కలిసి పోరాటం చేయండి.