Listen to this article

జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి పునాదులు పడ్డ చారిత్రాత్మకమైన దినమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి తెలియజేశారు. ఆదివారం రిపబ్లిక్ డే సంధర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుచ్చిరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకుని సంబురాలు చేసుకున్నారు. ఈ వేడుకలలో మాజీ జడ్పీటీసీ చక్రపాణి, పరకాలఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ రవీందర్, నాయకులు చిందం రవి, రవిపాల్, క్రిష్ణమూర్తి, హైదర్, ప్రకాష్ రెడ్డి, రాజేందర్, రాజు, రఫీ, బాసాని రవి, పత్తి శ్రీను, వీరన్న, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు….