

జనం న్యూస్ జనవరి 26 శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలోని విద్యార్థులందరికీ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు సామల వీరేశం జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి పాఠశాలల్లోని విద్యార్థులందరికీ ఆదివారం టై బెల్టులను అందజేసినారు. అలాగే జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో దిడ్డి సాంబయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు దిద్ది రమేష్ పాఠశాల విద్యార్థిని లందరికీ టైబెల్టులను అందజేసినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర రావు శ్రీలత అమ్మ పాఠశాల చైర్పర్సన్ లోకల్ బోయిన అనురాధ మామిడి తిరుపతమ్మ పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలు పాఠశాల దాత బాసని సుబ్రహ్మణ్యం కుమారస్వామి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు….