

( జనం న్యూస్ 24 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )
రోడ్డు ప్రమాదాలలను నివారించేందుకు రాకపోకలు సాఫీగా జరిగేందుకు భీమారం పరిధిలోని ప్రధాన రహదారులను అభివృద్ధి చేశారు.. రోడ్లకు ఇరువైపులా రెండేసి లైన్లు విస్తరించిన పోలీసులు శాఖ అధికారులు సమన్వయంతో వేగ పరిమితిని నిర్ధారిస్తూ.. సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన దీంతో ఇక ఇబ్బందులు ఉండవని అంతా భావించారు.. అయితే వాహనదారులు ఆయా రోడ్లపై అతివేగంగా దూసుకెళ్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రధాన రహదారులను ఇరువైపులా కాలిబాటలు నిర్మించారు విభాగినులకు రంగులు వేసి ట్రాఫిక్ లైన్ మార్కింగ్ చేశారు రహదారి మలుపులు కూడళ్ల వద్ద వేగనిరోధకాలు ఏర్పాటు చేశారు.. పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నా వేగం తగ్గించడం లేదని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నామని అన్నారు