

జనం న్యూస్ 24జూలై ( కొత్తగూడెం నియోజకవర్గం )
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి ఈ ప్రాంతనికి చెందిన వ్యక్తి అయిన రైతులకు ఒరిగింది ఏమీ లేదని సీతారామ కాలువ ఇరు ప్రక్కన ఉన్న రైతులు నీళ్లు లేక అహర్నిశలు కష్టాలు పడుతున్న నీళ్ళు తరలించకపోయే కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏ విధంగా స్పందించడం లేదని తీవ్ర విమర్శలు చేశారు, రైతులకు ఇస్తానన్న 15000 ఇవ్వకుండా 6000 మాత్రమే రైతులకు భరోసా కింద ఇవ్వడం ఎంతవరకు సబమని గత సంవత్సరంలో రెండు పర్యాయాలు రైతులకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రిని సూటిగా ప్రశ్నించారు, మీ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినప్పుడే రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయకుండా కొంతమందికి రుణమాఫీ చేసి రైతులందరికీ రుణమాఫీ చేశామని అబద్ధపు మాటలు చెబుతున్నారని అన్ని విషయాలు రాష్ట్ర ప్రజల గమనిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు, కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఏ కార్యక్రమం చేసినా క్షేత్రస్థాయిలో రైతులకు చేరకుండా చూస్తున్న ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వమని విమర్శించారు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారం తప్పక వస్తుందని రైతులను రాజు చేసే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమని ఈ సందర్భంగా అన్నారు.రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తగినన్ని ఎరువులు ఉన్నాయని రైతులకు ప్రెస్ మీట్ ల ద్వారా చెబుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో రైతులకు ఎరువుల అందకుండా చేస్తున్న దళారులు ఎవరని వారిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు ఏనుగు వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్దకు చేర్చడంలో పూర్తిగా విఫలమైనారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రైతులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిస్తారని భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపన సీతారామరాజు,రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు నాయకులు చిలుకూరి రమేష్, ఏనుగు వెంకట్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకులు రంజిత్ పాల్వంచ మండల అధ్యక్షుడు రాపాక రమేష్, లక్ష్మీదేవి పల్లి మండలాధ్యక్షుడు గాంధీ నాయక మరియు రాష్ట్ర జిల్లా మండల నాయకులు భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు.