

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 24 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించడం జరిగిందని సామాజిక అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పోటు శ్రీనివాసరావు తెలిపారు, అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించిన గుర్రం జాషువ కుల వివక్షకు గురయ్యారు. సమాజంలో, పాఠశాలలో, కవిగా కూడ వివక్షను ఎదుర్కొన్నాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పది సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగాసేవలందించారు. అనంతరం ఆంద్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యులు గా ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు.మహోన్నత వ్యక్తి త్వం గల గుర్రం జాషువా మూఢాచారాల పై తిరుగుబాటు చేసారు.సమాజాన్ని మేల్కొలిపిన గొప్ప మానవతావాది. అంటరానితనాన్ని పారద్రోలడానికి కృషిచేసిన మహనీయుడు గబ్బిలం. ఫిరదౌసి. ముంతాజ్ మహల్.కాందిశీకులు బాపూజీ, నేతాజీ,క్రీస్తు చరిత్ర వంటి రచనలు చేశారు వారి పద్యాలు రచనల ద్వారా సమాజాన్ని చైతన్య పరిచారు వారి జీవితం లో అనేక అంతర్జాతీయ జాతీయ పురస్కారాలు లభించాయి సామాజిక విప్లవ కవిగా రచయితగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తీ గుర్రం జాషువా వారి వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు ఘన నివాళులు అర్పించడం జరిగిందని సామాజిక అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పోటు శ్రీనివాసరావు తెలిపారు