Listen to this article

అహర్నిశలు ప్రజలకోసం పరితపిస్తున్న కారణజన్ముడు కేటీఆర్…

తెలంగాణ సమగ్రాభివృద్ధి ఆయన ముందున్న ఏకైక లక్ష్యం…

జనం న్యూస్ జూలై 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,యువ నేత,మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలు.గురువారం మండల కేంద్రంలోని స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తొగరు రమేష్ కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వీట్లుపంచి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్ మాట్లాడుతూ..నాడు తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం కెసిఆర్ పెట్టిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ జెండాను తండ్రికి తగ్గ తనయుడుగా కేటీఆర్ భుజాన వేసుకుని ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోరాడిత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన రాష్ట్రాన్ని సాధించారని,రాష్ట్ర అవతరణ అనంతరం 10 సంవత్సరాల కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని, అదేవిధంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి దశ దిశా కల్వకుంట్ల తారక రాముడే అని ఆయన నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకోనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, ఆకుపాముల పిఎసిఎస్ చైర్మన్ రామ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కోళ్ల ఉపేందర్, ఇంద్ర శేఖర్ రెడ్డి, ఎల్ పి రామయ్య, చీకటి శ్రీను,నల్లపాటి నాగరాజు, గడ్డంలింగయ్య, వేట శివాజీ, వి నరసింహారావు,ఎల్ పి రాజేష్,దొంగరి శ్రీను,సైదా, వెంకట్ రెడ్డి నాగుల్ మీరా, రచ్చ శ్రీను, లక్ష్మయ్య, గురుమూర్తి, దేవదాసు, వీరారెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.