

జనం న్యూస్ జూలై 25:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో ఉన్న సొసైటీ ఫంక్షన్ హాల్ లో నేడే జిల్లా న్యాయ సేవధికార సంస్థ నిజామాబాద్ మరియు మండల న్యాయ సేవధికార సంఘం ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. న్యాయ చైతన్యం పెంపోందించేందుకు న్యాయ చైతన్య అవగాహన సదస్సును ఉదయం 10-00గంటలకు ఏర్పాటు చేశారు.ఇట్టి న్యాయ సదస్సుకు జిల్లాప్రధానన్యాయమూర్తి,నాయమూర్తులు, ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి,ఆర్మూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్, ఆర్మూర్ ఏ సి పి వీరు ప్రజలకు న్యాయ హక్కులు, మహిళా రక్షణ చట్టాలు, న్యాయ సేవా హక్కు, వైద్య రికార్డులు, నివాస, హింస బాధితుల హక్కులు మొదలైన అంశాలపై వివరణాత్మకంగా తెలియజేస్తారు. కావున ప్రజలందరూ ఈ అవగాహన సదస్సులో పాల్గొని తమ హక్కులపై అవగాహన సదస్సు కొరకు మండలంలోని ప్రజలందరూ హాజరు కావాలని తహసీల్దార్ కోరారు.
