Listen to this article

జనం న్యూస్ జూలై 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

భూ భారతి ఆర్జీలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ మునగాల తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలించి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ ఆర్జీలు పరిష్కరణ కొరకు గ్రామాల వారీగా క్షేత్ర స్థాయి లో పరిశీలించెందుకు రెండు బృందాలు ఏర్పాటు చేసి వేగవంతంగా పరిష్కరించాలని అంతకుముందు ఆర్జిల వారీగా రికార్డులు జతపర్చాలని తెలిపారు.విద్య సంవత్సరం ప్రారంభం అయినందున సర్టిపికెట్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని తెలిపారు.రెసిడెన్సీ సర్టిపికెట్ కొరకు ధరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన నేలమర్రి వాసి విద్యార్థి రాహుల్ కి నోట్ బుక్ ఇచ్చారు.జిల్లాలో యూరియా, డి ఎ పి కొరత లేదని సరిపోను నిల్వలు ఉన్నాయని,ఈ వారంలోపు ఇంకా దిగుమతి అవుతుందని యూరియా ఎం ఆర్ పి ధర కే కొనుగోలు చేయాలని రైతులకి సూచించారు.వ్యవసాయ అధికారులు నానో యూరియా పట్ల రైతులకి అవగాహన కల్పిస్తే సాగు ఖర్చులు తగ్గుతాయని కలెక్టర్ అన్నారు.మునగాల మండలంలో 5700 ఎకరాలు లో ప్రత్తి, 760 ఎకరాలులో వరి సాగు చేసారని ఇప్పటికే మొదటి విడత కింద అందరికి యూరియా పంపిణి చేశామని ఇంకా మండలంలో 5200 యూరియా సంచులు ఉన్నాయని ఈ స్టాక్ ఇంకా 20 రోజులకి సరిపోతుందని ఇంకో నాలుగు ఐదు రోజులలో మార్కుఫెడ్ నుండి లోడ్లు వస్తాయని మండల వ్యవసాయ అధికారి కలెక్టర్ కి వివరించారు.