

జనం న్యూస్ ; 25 జులై శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ పొందేందుకు రూపొందించిన దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) చివరి విడుతగా స్పెషల్ ఫేస్ నోటిఫికేషన్ ను ఉన్నత విద్యా మండలి జూలై 24న విడుదల చేయడం జరిగిందని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ సిద్దిపేట ప్రిన్సిపల్ డాక్టర్ జి సునీత గారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోస్త్ స్పెషల్ ఫేస్ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు ఆన్లైన్ ద్వారా జూలై 25 వ తేదీ నుండి జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా కళాశాలలను మరియు కోర్సును ఎంపిక చేసుకోవడానికి జూలై 25 నుండి జూలై 31 వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఆగస్టు 3న స్పెషల్ ఫేస్ అడ్మిషన్ల అలాట్మెంట్ ప్రకటించడం జరుగుతుందని, ఆగస్టు 3 నుండి ఆగస్టు 6 వరకు సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలని. తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 4 నుండి ఆగస్టు 6 వరకు వ్యక్తిగతంగా సిసిఓటిపితో కళాశాలను సందర్శించి ధ్రువపత్రాలను కళాశాల ప్రిన్సిపల్ కు సమర్పించి, కళాశాల రుసుముని చెల్లించి తమ సీటును ధ్రువీకరించుకోవాలని. విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మరియు కళాశాలలో సిసిఓటిపి తో రిపోర్ట్ చేయకపోయినా సీటు రద్దవుతుందని తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు అడ్మిషన్ పొందుటకు చివరి అవకాశం అని విద్యార్థులందరూ స్పెషల్ ఫేస్ అవకాశాన్ని ఉపయోగించుకొని అడ్మిషన్ పొందాలని తెలియజేశారు. దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ కె. భాస్కర్ మాట్లాడుతూ దోస్త్ స్పెషల్ ఫేస్ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటివరకు మూడు విడుదలలో అడ్మిషన్ పొందని విద్యార్థులు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించకుండా స్పెషల్ ఫేస్ లో పాల్గొనవచ్చు. ఇదివరకు దోస్తు ద్వారా రిజిస్ట్రేషన్ చేయని విద్యార్థులు 400 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి స్పెషల్ ఫేస్ లో పాల్గొనవచ్చని అలాగే విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ఇప్పటికే కళాశాలలో ఏర్పాటుచేసిన జిల్లా హెల్ప్ లైన్ సెంటర్ ను సంప్రదించవచ్చని తెలియజేశారు.