

జనం న్యూస్ జూలై 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఐ పోలవరం మండలం బాణాపురం గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో తులసీదాస్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా దీప ప్రజ్వలన చేసి పూజ చేసి హనుమాన్ చాలీసా పఠణం జరిగింది ధర్మ ప్రచారక్ కనకారావు మాట్లాడుతూ గోస్వామి తులసీదాసు గొప్ప కవి ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ (ప్రస్తుత బండా జిల్లాలోనిది) గ్రామంలో 1532 లో జన్మించాడు ఈయన శ్రీరాముని పరమ భక్తుడు ఈయన రామాయణాన్ని హిందీ మూలంలో అందించిన తొలి కవి అలాగే శ్రీరామునీ భక్తుడైన ఆంజనేయునిపై హనుమాన్ చాలీసా రచించారు. వాల్మీకి రచించిన రామాయణాన్ని సామాన్యుడు కూడా అర్థం చేసుకునే విధంగా హిందీలో అనువదించారు. మహమ్మదీయుల రాజ్య కాలంలో ఉత్తర భారత దేశంలో రామాయణం హిందూ ధర్మాన్ని కాపాడింది వారణాసిలో సంకటమోచన్ దేవాలయం కట్టించాడు ఇది హిందువులకు పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అయ్యింది. ఈ కార్యక్రమంలో మాతృమూర్తులు విద్యార్థులు పాల్గొని తులసీదాస్ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి జయంతి నిర్వహించారు వచ్చిన భక్తులు ప్రసాదం స్వీకరించి వెళ్లారు.
