

జనం న్యూస్ జూలై 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనమండలి సభ్యులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు 67వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గర్భిణీ స్త్రీలకు పళ్ళు రొట్టె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాండ్రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ నిరంతరం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ విధేయుడు గా పనిచేస్తున్న వ్యక్తి జన్మదిన వేడుకలు చేయడం సంతోషంగా ఉందని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సంక్షేమ లక్ష్యంగా పేద వాళ్ళని ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తపన పడుతున్నారని అందరం బంగారు కుటుంబం p4 కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు సత్యనారాయణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బోడి వెంకటరావు కోట్ని రామకృష్ణ పొలిమేర నాయుడు మల్ల గణేష్ చదరం శివ అప్పారావు కర్రి మల్లేశ్వరరావు కాండ్రేగుల జగదీష్ దాడి వివి అప్పారావు పిళ్ళా తారకేశు బొడ్డేడ గిరీష్ శ్రీకాకుళం గణపతి పెంటకోట వరప్రసాద్ దాడి వేణు మల్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.//