

బిచ్కుంద జూలై 25 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ యార్డు అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఒక కోటి 12 లక్షలు మంజూరు చేసింది ఈ మేరకు ఏపీ సి మరియు ప్రభుత్వ కార్యదర్శి ఎం రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు మార్కెట్లోని ఆయా పనుల నిమిత్తం నిధులు మంజూరు చేయాలని ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు కోరారు ఈ మేరకు నిధులు మంజూరు కావడంతో బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ లో శనివారం నాడు మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున అప్ప సెట్ కార్ మరియు మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఏఎంసీ అభివృద్ధికి రూపాయలు ఒక్క కోటి 12 లక్షలు మంజూరు చేయడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మరియు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున మాట్లాడుతూ మన మార్కెట్ కు ఒక కోటి 12 లక్షలు మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీకి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మరియు జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మీకాంతరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, యువజన నాయకుడు భాస్కర్ రెడ్డి, గుండె కల్లూరు మాజీ ఎంపీటీసీ రాజు పటేల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మన్మధ పటేల్ ,అజయ్ పటేల్, సాయిని అశోక్, సీమ గంగారం సార్, హనుమంత్ రెడ్డి, బండు పటేల్, మార్కెట్ కమిటీ సెక్రటరీ రాజు మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు