Listen to this article

జనం న్యూస్ ;26జులై శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్

;బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమారెడ్డి స్థానిక నలంద విద్యాలయలో ఆర్మీ జీవన్ లా త్యాగాలు వెలకట్టలేని దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి శత్రువుల నుండి దేశాన్ని రక్షిస్తూ సేవలు చేస్తున్న సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని బిజెపి మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు ఇర్రి ఉమా రెడ్డి అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సిద్దిపేటలో బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో దేశానికి సేవలందించి రిటైర్ అయిన ఆర్మీ జవాన్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబాల్ని వదిలి దేశ సరిహద్దుల్లో ఎండనక వాననక, రేయింబవళ్లు కాపు కాస్తున్న సైనికులకు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేము అని అన్నారు. భారతదేశ సరిహద్దుల్లో పహార కాస్తూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలతో జరిగిన యుద్దాలలో మరియు కార్గిల్ పోరాటంలో మరియు మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూరులో వందలాది మంది సైనికులు ప్రాణ త్యాగం చేశారని అన్నారు. ప్రతి ఒక్క యువకుడు దేశభద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని దేశానికి సేవ చేస్తున్న సైనికులను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాలు రిటైర్డ్ ఆర్మీ జవాన్ మల్లికార్జున్ మరియు రెగయ్యా లకు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నలంద స్కూల్ ప్రిన్సిపాల్ గాలిపల్లి హరినాథ్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.