Listen to this article

జనం న్యూస్ జూలై 26 నడిగూడెం

వర్షపు నీరు వృధా కాకుండా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంటలను నిర్మించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నడిగూడెం మండల ప్రత్యేక అధికారి, డీఎఫ్ఓ సతీష్ కుమార్ కోరారు. శనివారం నడిగూడెం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను జిల్లా పిడి అప్పారావు తో కలసి పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ సయ్యద్ ఇమామ్, ఎంపీఓ విజయ్ కుమారి,ఏపీవో రవీందర్, ఈసీ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి యలక ఉమారాణి, టీఎ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.