Listen to this article

ఎస్సై కే శ్వేత

_(జనం న్యూస్ ;26జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేటరవి )

ఆర్మీ జీవన్ లా త్యాగాలు వెలకట్టలేని దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి శత్రువుల నుండి దేశాన్ని రక్షిస్తూ సేవలు చేస్తున్న సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని భీమారం మండల ఎస్సై కే శ్వేత అన్నారు.కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశానికి సేవలందించి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబాల్ని వదిలి దేశ సరిహద్దుల్లో ఎండనక వాననక, రేయింబవళ్లు కాపు కాస్తున్న సైనికులకు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేము అని అన్నారు.భారతదేశ సరిహద్దుల్లో పహార కాస్తూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలతో జరిగిన యుద్దాలలో మరియు కార్గిల్ పోరాటంలో మరియు మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూరులో వందలాది మంది సైనికులు ప్రాణ త్యాగం చేశారని అన్నారు.ప్రతి ఒక్క యువకుడు దేశభద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని దేశానికి సేవ చేస్తున్న సైనికులను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేయాలని అన్నారు.