

జనం న్యూస్ జూలై 28 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో శ్రావణమాసం పురస్కరించుకొని శ్రీ రామలింగేశ్వర స్వామిని మంజీరా నదిలో మొదటి శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామికి మంజీరా నదిలో జలాభిషేకం నిర్వహించారు అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి ఏటా శ్రావణమాసంలో శ్రీ రామలింగేశ్వర స్వామికి జలాభిషేకం నిర్వహిస్తారు చండూరు గ్రామంలో శివాలయంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామిని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామిని పల్లకిలో ఊరేగించుకుంటూ మంజీరా నదిలోకి వెళ్లి అక్కడ గంగమ్మ దగ్గర శ్రీ రామలింగేశ్వర స్వామికి జలాభిషేకం నిర్వహిస్తున్నారు ప్రతిఏటా శ్రావణమాసంలో శ్రావణ సోమవారం మొదటి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తదనంతరం వీధుల గుండా శ్రీ రామలింగేశ్వర స్వామిని ఊరేగింపుగా తీసుకువెళ్తారు భక్తిశ్రద్ధలతో మహిళలు మంగళహారతులు మరియు కొబ్బరికాయలు శ్రీ రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించుకుంటూ శివాలయంలోకి వస్తారు రాత్రి సమయంలో పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుంది. చండూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రావణమాసం సందర్భంగా శివాలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహిస్తారు శ్రావణ సోమవారం కావున స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు రాత్రి సమయంలో భజన కార్యక్రమాలు ప్రతిరోజు తప్పకుండా భక్తులు భజన మండలి సభ్యులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు శ్రీ రామలింగేశ్వర స్వామి చండూరు గ్రామ ప్రజలపై ఆయన యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని గ్రామస్తులు భక్తులు కోరుకుంటున్నారు