Listen to this article

నాగుల పంచమికి, తమ అక్క చెల్లెళ్లకు, తోబుట్టువులకు ప్రత్యేక బహుమతులు

జనం న్యూస్,జులై 28,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని గ్రామాలలో తమ తోబుట్టువులకు నాగుల పంచమి పండగ సందర్భంగా ప్రత్యేక బహుమతులను అందిస్తున్నారు.జీవిత శైలి ఎన్ని మార్పులు చెందినా,ఆధునికత ఎంతగా విస్తరించినా మన పూర్వీకుల విలువలు, సంప్రదాయాలు కొన్ని ప్రాంతాల్లో నేటికీ సజీవంగా ఉన్నాయి. తెలంగాణ,కర్ణాటక మహారాష్ట్ర,సరిహద్దుల్లోని కంగ్టి,పిట్లం,బీదర్ కర్ణాటక,నాందేడ్, దెగ్లూర్ మహారాష్ట్ర ప్రాంతాలు.ఈ నాగుల పంచమి పండుగకి ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.సాధార ణంగా నాగుల పంచమి అంటే పాములకు పూజలు చేసి,పుట్టలో పాలు పోయడం గుర్తుకు వస్తుంది.కానీ ఇక్కడ నాగులపంచమికి అత్యంత విశిష్టత ఉంది. కాలం ఎలా మారినా,ఈ పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకుంటూ సంప్రదాయాలకు పట్టం కడుతున్నారు.ప్రతి ఇంట్లోనూ సోదరీమణులకు, మేనకోడళ్లకు, తోబుట్టువుల కూతుళ్లకు,జాకెట్ బట్టలు,రెండు కుడకలను ప్రత్యేక బహుమతులుగా ఇవ్వడం ఓ ఆనవాయితీగా కొనసాగుతోంది.ఇంతకీ ఈ సంస్కృతి గొప్పతనం ఏంటంటే అన్నదమ్ములు లేని పరిస్థితుల్లోనైనా,వారి పిల్లలకు బహుమతులు తీసుకెళ్లడం ద్వారా, బంధాలను కాపాడుతున్నారు.ఇది కేవలం ఆచారంగా కాకుండా,బంధాలను బలపరిచేలా మారింది. ఆడపడుచుల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ,ఇంటి పరంపరలను గౌరవంగా నిలుపుతూ సాగుతున్న ఈ పండుగ గతాన్ని గుర్తిస్తూ,భవిష్యత్తును నిర్మించేలా మారుతోంది. సాంకేతిక యుగంలోనూ ఈ సాంప్రదాయాన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.