

జనం న్యూస్ జులై 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు, 10 నెలల కోడిగుడ్ల బిల్లులు చెల్లించాలని వెంటనే వంటకు అవసరమైన గ్యాస్ ను ప్రతి పాఠశాలకు ఉచితంగానే సరఫరా చేయాలని, కొత్త మెనూకి అనుగుణంగా అదనపు బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా సీపీఎం పార్టీ నాయకులు దుర్గం దినకర్ ముంజం ఆనంద్ కుమార్ తమ పూర్తీ మద్దతు సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొట్రంగి శారద పాగిడి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు అవసరమైన గ్యాస్,ను సబ్సిడీలు ప్రభుత్వమే ఇవ్వలన్నారు ఈ.ఎస్.ఐ పి.ఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదు నెలల పెండింగ్ వేతనాలు, 10 నెలల కోడి గ్రుడ్ల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం పథకం బిల్లుల నిర్వహణను యుకుబేర్ నుండి మినహాయించాలి. పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన గ్యాసన్ను ప్రతి పాఠశాలకు ఉచితంగా సరఫరా చేయాలి. కొత్త మెనూకి అదనంగా బడ్జెట్ కేటాయించాలి.ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.10,000/ ల వేతనం పెంచి అమలు చేయాలి.మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణ ఆపాలి.నగదు బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి కార్మికులుగానే కొనసాగించాలనీ డిమాండ్ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరిష్కారానికి జూలై 6వ తేదిన విద్యాశాఖ కమీషనర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా నాయకులు మండల అధ్యక్ష కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు