Listen to this article

జనం న్యూస్ జులై 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్, ఆసిఫాబాద్ ఏఎస్పి చిత్రంజన్ ఆదేశాల మేరకు, షీ టీం ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వాంకిడి మండలం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా వాంకిడి ఏఎస్ఐ పోశెట్టి,షీ టీం సభ్యులు విద్యార్థినులకు భద్రతా చట్టాలు, ఆపద సమయంలో ఎలా స్పందించాలి, డయల్ 100, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, ఈవ్ టీసింగ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినులు తమ హక్కులను తెలుసుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు. విద్యార్థినిలు ఎవరైనా వేధింపులకు గురి అయినట్లయితే వెంటనే ఆసిఫాబాద్ షీ టీం నెంబర్ 8712670564 నెంబర్ కి సమాచారం అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం,సిబ్బంది , షీ టీం సిబ్బంది స్వప్న, రజిని, దినేష్,ఏ ఎస్సై పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.