

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ లోని గ్రంథాలయం నకు మరింత ఆకర్షణీ య సొబగులు దిద్ది పాఠకులకు చేరువ చేసి విజ్ఞానంపెంపొందించుటకొరకు మండల స్థానిక స్వచ్ఛంద సంస్థల (లయన్స్ క్లబ్, వాకర్స్ క్లబ్ మరియు మానవతాసంస్థ )ఆధ్వర్యంలో నూతనంగా నామపలకాలు (పేరు, రాష్ట్ర లోగో మరియు రాష్ట్ర చిహ్నాలను గ్రంథాలయ ప్రహరీ గోడకు సుందరముగా చిత్రీకరించి ఇవాళ ఆవిష్కరించడం జరిగింది. ఆవిష్కరణ అనంతరం విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ లయన్ డాక్టర్ బచ్చు జయ భాస్కరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి జ్ఞాన సమూపార్జన ఎంతో అవసరమని వాటిని గ్రంథాలయాల ద్వారా పెంపొందించుకోవచ్చని, పిల్లల నుండి పెద్దల వరకు నిత్యం గ్రంథాలయమునకు హాజరై అక్కడి మంచి పుస్తకాల ద్వారా ఎంతో విలువైన విషయాలను తెలుసుకోగలరని సాధ్యమైనంత వరకు విద్యార్థులను మొబైల్ ఫోన్ కు వ్యసనం కాకుండా దూరంగా ఉంచాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మన్నెం. రామమోహన్ SI అఫ్ పోలీస్ మాట్లాడుతూ తల్లితండ్రులు బాధ్యత గా పిల్లలను గ్రంధాలయం నకు వచ్చేవిధం గా చూడాలని, పుస్తకాలు చదవడం ద్వారా పాత చరిత్ర ను మరియు విజ్ఞాన దాయక మైన క్రొత్త విషయాలు తెలుసుకోవటం వలన భవిష్యత్తు కు దిక్సూచి గా పుస్తకాలు ఉపయోగ పడగలవని మున్ముందు మరెన్నో మంచి పుస్తకాలను గ్రంథాల యమునకుసమకూర్చగలమని తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు లయన్ డాక్టర్ బచ్చు జయభాస్కర్ రావు, లయన్ మన్నెం. రామమోహన్, లయన్ కుర్రా మణి యాదవ్, కొత్తపల్లి రాజాచారి, వాకర్ ఉప్పుశెట్టి సుధీర్, వాకర్ మోడపోతుల రాము, గంధం గంగాధర్, గుండు సురేష్, తాటి సుబ్బరాయుడు, కానకుర్తి వెంకటయ్య మరియు ఖాదర్ పాల్గొన్నారు.