Listen to this article

మద్నూర్ జూలై 30 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామ శివారులోనీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు బుధవారం సందర్శించి స్కూల్ లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.పాఠశాలలో ఉన్న సమస్యలను విని తక్షణమే పరిష్కరించారు.ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులకు నీటి సమస్య ఉండటంతో వెంటనే బోర్ వెల్ కొరకు లక్ష రూపాయలు మంజూరు చేశారు. అనంతరం హాస్టల్ గేట్ వద్ద సెక్యూరిటీ గార్డు కాపల ఉండటానికి ఒక లక్ష రూపాయలు వెంటనే మంజూరు చేశారు . అదే విధంగా మెస్ వద్ద కు వెళ్ళడానికి విద్యార్థులకు సౌకర్యం గా ఉండటానికి నాలుగు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.హాస్టల్ సందర్శన సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి హాస్టల్ అధికారులు, విద్యార్థులు సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే వాటి పరిష్కరిస్తూ నిధులు మంజూరు చేయగానే విద్యార్థులు, అధికారులు సంతోషం వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.వన మహోత్సవం లో భాగంగా హాస్టల్ లో అటవీ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ గారు మొక్కలను నాటారు.కలెక్టర్ గారి వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి గారు, DPO, DLPO, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి, మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, ఎంపిడిఓ రాణి, ఎంపీవో నర్సయ్య, గిర్దవార్ ఏం శంకర్, గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.