

జనం న్యూస్ జులై 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
భూపాలపల్లి నియోజకవర్గం, గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు అబ్బు కుమార్ రెడ్డి కిడ్నీ నొప్పితో బాధపడుతూ, ఆపరేషన్ చేయించుకున్న హన్మకొండ అజార హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న విషయం తెలిసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కుమార్ రెడ్డి ని పరామర్శించి మనోధైర్యం ఉండాలని చెప్పారు.డాక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.ఆయన వెంట గణపురం మాజీ పిఎసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణ చంద్రారెడ్డి,వారి కుటుంబ సభ్యులు ఉన్నారు…