

జనం న్యూస్,జూలై30, అచ్యుతాపురం:
అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీలో పూడిమడక గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 113-పార్టులో 45.48 ఎకరాలు,139- పార్టులో 120.67 ఎకరాలు మొత్తంగా 166.15 ఎకరాలు భూమిలును ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్కు అభివృద్ధి కోసం కేటాయించి, భూ బధలాయింపు చెయ్యాలనే నిర్ణయాన్ని
పూడిమడక మత్స్యకార నాయకులు వ్యతిరేకిస్తూ డిప్యుటీ తహసీల్దార్ శ్యామ్ ఫిర్యాదు పత్రాన్ని అందించి అభ్యంతరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూడిమడక గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉప్పు గల్లీల్లుకు సంబందించిన పై సర్వే నెంబర్లు భూముల్లో అనేక దశాబ్దాలుగా ఉప్పు గల్లీలు పై అనేకవందల మంది ఉప్పు రైతులు, ఉప్పు కార్మికులు ఆధారపడి జీవించారని, ఉప్పుటేరు పై అనేక వందలమంది మత్స్యకార్లు ఆధారపడి ఉప్పుటేరులో వేటచేసుకుని జీవించేవారని,పూడిమడక ప్రజలకు ఎటువంటి సమాచారం తెలియజేయకుండా, ప్రజలు అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా 166 ఎకరాలు ప్రభుత్వ భూములను ఎలా బధాలయిస్తారని అన్నారు. తేదీ:09-07-2025న రహస్యంగా గ్రామ పంచాయతీలో నోటీసును ప్రకటించారని, గ్రామంలో దండోరా వేయకుండానే వేసినట్లు ప్రకటన చేయడాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకస్తున్నామని ఇప్పటికే తీవ్రమైన పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని,
ఇప్పటికైనా గ్రామంలో దండోరా వేసి గ్రామ సభ ఏర్పాటు చేసి,ప్రజలు అందరి అభిప్రాయాలను తీసుకోవాలని కోరడంతో గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ప్రజా అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని డిటీ చెప్పారని తెలిపారు.గ్రామ సభ నిర్వహించకపోతే గ్రామంలో అందరినీ పార్టీలకు అతీతంగా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంను చేపడతామని హెచ్చరించారు.ఫిర్యాదు చేసిన వారిలో చోడిపల్లి అప్పారావు,మాజీ ఉప సర్పంచ్,వాసుపల్లి శ్రీనివారావు,వైస్ ఎంపీపీ,మేరుగు చినరాజులు, మత్స్యకార నాయకులు,చేపల శ్రీరాములు,కో ఎంపీటీసీ,ఉమ్మిడి జగన్,అప్పారావు మత్స్యకార నాయకులు,మేరుగు వసంతరావు, సూరాడ పోలయ్య , మేరుగు రమణ బాబు ఉన్నారు.