

జనం న్యూస్ ఆగస్టు 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలలో ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకo గా తీసుకొని ప్రతి నెల 2740 కోట్లు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి నెల ఒకటవ తేదీన ఉదయం 6 గంటల నుండి పెన్షన్ లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్కుతుందని మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ద నాగ జగదీశ్వరరావు అన్నారు. ఈరోజు ఉదయం జీవీఎంసీ 81వ వార్డులో నూతన పెన్షన్ భర్త చనిపోయిన మహిళలకు పిలా వెంకట్ రెడ్డి నాయుడు వీధిలో బుద్ధ అప్పారావు భార్య లక్ష్మికి నూతన పెన్షన్ 4000 రూపాయలు నాగ జగదీష్ ఆమెకి అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొణతాల బాబురావు పెంటకోట శివరాం ఆళ్ల జగన్ జనసేన నాయకులు విల్లూరి హరి బిజెపి నాయకులు కొణతాల అప్పలరాజు పిలా అప్పలనాయుడు కొణతాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.//