

జనం న్యూస్ ఆగస్టు ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
మురమళ్ళ శాసనసభ్యులు వారి కార్యాలయంలో గోదావరి పుష్కరాలపై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు
రాబోయే గోదావరి పుష్కరాలు పురస్కరించుకుని పుణ్య స్నానాలు ఆచరించే భక్తుల కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించిన ప్రభుత్వ వైపు మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారు, ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కుండలేశ్వరం, మురమళ్ళ, గేదెలంక పుష్కర ఘాట్లకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని దానికి అనుగుణంగా తగు సౌకర్యాలు కల్పించాలని, నియోజకవర్గంలో గల అన్ని పుష్కర ఘాట్లకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం, గాట్ల రిపేర్లు, నూతన గోట్ల నిర్మాణం, ఎలక్ట్రిఫికేషన్, రోడ్డు సౌకర్యం, శానిటేషన్, ఆలయాల అభివృద్ధి మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై ఆయా శాఖ అధికారులతో సమీక్షించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ, పంచాయతీరాజ్, హెడ్ వర్క్స్, విద్యుత్, రోడ్లు భవనాలు శాఖ అధికారులు మరియు దాట్ల పృథ్వి గారు, దాట్ల పవన్ ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.