Listen to this article

జనం న్యూస్ జులై 31 కోటబొమ్మాలి మండలం

:నిమ్మాడలోవైభవంగా వివాహ మహోత్సవంశ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాళి మండలానికి చెందిన నిమ్మాడ గ్రామం మరోసారి ఉత్సాహంతో నిండిపోయింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారి సోదరులు కింజరాపు ప్రభాకర్ గారి పెద్ద కుమారుడు అశోక్, శ్యామల కుటుంబానికి చెందిన ప్రణవి వివాహం శుక్రవారం తెల్లవారుజామున సంప్రదాయబద్ధంగా, ఘనంగా జరిగింది.ఈ శుభకార్యానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలోని రాజకీయ, పారిశ్రామిక, క్రీడా రంగ ప్రముఖులు, కుటుంబ స్నేహితులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివాహ వేడుకలో కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు కుటుంబ సమేతంగా పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు.పెళ్లి పందిరిలో మంగళవాయిద్యాల హోరాహోరీ, సాంప్రదాయ సంగీతం, సందడితో ఉత్సవ వాతావరణం నెలకొంది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న ఈ వేడుకలో వివిధ రంగాల ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు.హాజరైన ప్రముఖులు:శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడుశాసనసభ్యులు: బి. జగదీశ్వరి, పంచకర్ల రమేష్, బండారు సత్యనారాయణమూర్తి, లలిత కుమారి, పల్లా శ్రీనివాస్, గణబాబు, నమ్మక జయకృష్ణ, లోకం మాధవి, విష్ణు కుమార్ రాజుశాసనమండలి సభ్యులు: గాదె శ్రీనివాస నాయుడు, వేపాడ చిరంజీవిపీఎసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్ తదితరులుఅశోక్ – ప్రణవి దంపతులకు ఆయురారోగ్యాలతో కూడిన సుఖసంతోషాలు, సమృద్ధి కలగాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు. సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఈ వివాహ వేడుక ఆధునికతను సమపాళ్లలో మేళవించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.