Listen to this article

జనం న్యూస్ 01 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా, ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన ఆర్.ఎస్.ఐ. ఎ.ఆర్.పండాను జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో జూలై 31న ఘనంగా సత్కరించి “ఆత్మీయ వీడ్కోలు” పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్ డ్ రిజర్వు పోలీసుల పాత్ర ఎనలేనిదన్నారు. పోలీసు విధులను సమర్ధవంతంగా నిర్వహించడం చాలా కష్టతరమన్నారు. క్లిష్ట
పరిస్థితులు, విభిన్న వాతావరణంలో విధులు నిర్వహించడంతో పోలీసు ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టలేని పరిస్థితులు ఉంటాయని, తద్వారా ఉద్యోగ విరమణ చేసే సమయానికి అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఆర్.ఎస్.ఐ. ఎ.ఆర్.పండా ఆర్మ్ డ్ రిజర్వు విభాగంలో సమర్ధవంతంగా, ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించారన్నారు. మావోయిస్టులు కార్యాకలాపాలను నియంత్రించుటలోను, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టుటలో ఎటువంటి రిమార్కులు లేకుండా సుమారు 40సం.లు పోలీసుశాఖకు సేవలందించడం అభినందనీయ మన్నారు. ఉద్యోగ బాధ్యతలతోపాటు, వారి పిల్లలను కూడా ఉన్నత. విద్యావంతులుగా తీర్చిదిద్ది, ఉన్నత స్థానంలో నిలిచేలా చేసారన్నారు. ఉద్యోగ విరమణ తరువాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సమాజానికి మంచి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన బెనిఫిట్స్ రావడంలో ఇబ్బందులు తలెత్తితే, పరిష్కారానికి రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటామన్న భరోసాను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కల్పించారు. అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన ఆర్ఎస్ఐ ఎ.ఆర్.పండా దంపతులను జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సాలువలతోను, పూలమాలలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపిక, సన్మాన పత్రంను ప్రధానం చేసి, ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు పలికారు. అదే విధంగా జిల్లా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరుపున జిల్లా ఎస్పీ గిఫ్ట్, చెక్లను అందజేసారు. ఉద్యోగ విరమణ చేసిన అధికారులు మాట్లాడుతూ తమ సర్వీసులో సహాయ, సహకారాలను అందించిన అధికారులు, సహెూద్యోగులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్పీ ఎఆర్ జి.నాగేశ్వరరావు, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలా రావు, రిజర్వు ఇన్పెక్టర్లు ఎన్.గోపాల నాయుడు, టి.శ్రీనివాసరావు, పలువురు ఆర్.ఎస్.ఐ.లు పోలీసు అసోసియేషను అధ్యక్షులు కే.శ్రీనివాసరావు మరియు ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.