Listen to this article

జుక్కల్ ఆగస్టు 01 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు ధర్నా నిర్వహించి కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు. జిల్లా నాయకులు. సురేష్ గొండ పాల్గొని మాట్లాడుతూ మండలంలోని వివిధ పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని. మరి ముఖ్యంగా. 9 నెలల నుండి కోడిగుడ్ల బిల్లులు. ఐదు నెలల పెండింగ్ వేతనాలు. కూరగాయల బిల్లులు. ఇతర కిరాణా సామాన్ బిల్లులు లేక కార్మికులు. కిరాణా షాప్ యజమాన్యం దగ్గర ఉద్దెర సామాన్ల కొరకు. తమ దగ్గర ఉన్న. బంగారము. పుస్తెలతాడులు. కొన్నిచోట్ల తాకట్టు పెట్టి వడ్డీ కింద కిరాణా సామాన్లు తెచ్చి. తమ గ్రామాల్లో ఉన్న పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకు మంచి భోజనాలు అందిస్తూ సేవలు చేస్తున్న వీరికి నెలల తరబడి. బిల్లులు ఇవాక. వేతనాలు రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికైనా ఈ రెండు మూడు రోజుల్లో పిల్లలు రాకుంటే. హైదరాబాద్ లోని. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు. ఆగస్టు ఆరు తేదీనాడు ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా సిఐటియు. జిల్లా నాయకులు. సురేష్ గొండ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మిక సంఘం. జిల్లా కార్యదర్శి. సరస్వతి. మద్నూర్ మండల అధ్యక్షురాలు. సావిత్రి. డోంగ్లి మండల అధ్యక్షురాలు. వచల బాయ్. మండల కార్యదర్శి. ఫర్జానా. ఉపాధ్యక్షురాలు. లాలాబాయి. సహాయ కార్యదర్శి. మొగులవ. కార్మికులు. రేఖ భాయ్. సారు భాయ్. ద్రౌపత భాయ్. మద్నూర్ మండలంలోని. మరియు. డోంగ్లి. మండలంలోని. వివిధ. పాఠశాలల. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.