

జనం న్యూస్ 02 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం కోటను అనుకొని ఉన్న ఇళ్లను మాన్సాస్ అధికారులు శనివారం తొలగించారు.
కొన్నేళ్లుగా ఇక్కడే నివాసము ఉంటున్న కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. అయితే గత కొద్ది రోజులుగా ఖాలీ చేయాలని అధికారులు చెప్తున్నప్పటికీ వినిపించుకోకపోవడంతో పోలీసులు సహకారంతో జేసీబీలతో తొలగించారు. తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా తొలగిస్తే పిల్లలతో ఎక్కడకు వెళ్తామని నిరాశ్రయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.