Listen to this article

జనం న్యూస్,ఆగస్టు02,అచ్యుతాపురం:

రైతు ఆరోగ్యంగా పంట పండిస్తే అందరి పంట పండినట్లేనని, రైతు పండించకపోతే జీవనాధారమే లేదని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. శనివారం నాడు మున్సిపాలిటీ పరిధిలో రామారాయుడుపాలెంలో వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమాల పాల్గొని వరి యంత్రాన్ని ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ రాష్ట్ర రోడ్లు అభివృద్ధి చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు,ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు అందిస్తామని చెప్పడం జరిగిందని,20 వేల రూపాయలను మూడు విడతలగా లబ్ధిదారులు ఖాతాలోకి జమచేస్తారని, రైతుల మేలుకొరకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మోహన్ రావు, సహాయకులు అరుణ, దీపిక,దేవుడు రైతులు కూటమి నాయకులు పాల్గొన్నారు.