Listen to this article

జనంన్యూస్. 03.నిజామాబాదు. టౌన్.

నిజామాబాదు. వినాయక నగర్, శ్రీనగర్ కాలనీ రోడ్ నెం.4 లో ఏర్పాటు చేసిన ఆరోగ్య యోగ కేంద్రంను అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు బిజెపి ప్రభుత్వం మోదీ గారు అధికారంలో వచ్చాక అంతర్జాతీయ స్థాయిలో యోగకు గుర్తింపు వచ్చిందని అన్నారు. నేటి ఆధునిక జీవనశైలిలో మానవుడు శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా ఈ పరిస్థితుల్లో యోగ సాధన ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని పొందవొచ్చు అన్నారు. తనువు, మనస్సు, శరీరాన్ని ఏకం చేసి నిర్వహించే యోగ ఆసనాల వలన మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చు అన్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగకు ఎంతో ప్రాధాన్యత ఉందని అందుకే ఇటువంటి కేంద్రాల స్థాపన ద్వారా ప్రజల ఆరోగ్య అభివృద్ధి చెందుతుంది అన్నారు ప్రతి ఒక్కరు రోజు వారి దినచర్యలో యోగాను అలవరుచుకోవాలని సూచించారు. ఇందూర్‌లో ప్రజలకు యోగతో పాటు పౌష్టిక ఆహారాన్ని కూడా అందిస్తూన్నా ఈ ఆరోగ్య యోగ కేంద్రం ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నారు.
ఈ ఆరోగ్య యోగ కేంద్రం ద్వారా స్థానికులకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, మరియు ఆరోగ్య సంబంధిత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, నిపుణులైన యోగ గురువుల నేతృత్వంలో ప్రతిరోజూ నిర్వహించనున్న ఈ శిక్షణలు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు.
కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ పంచారెడ్డి లావణ్య,లింగం యోగ యోగ గురువులు రంజిత్,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు ప్రభాకర్, మఠం పవన్, హరీష్,తదితరులు పాల్గొన్నారు.