

భద్రాద్రి కొత్తగూడెం 03జూలై ( జనం న్యూస్ )
శనివారం ఉదయం 11 గంటలకు మధుర బస్తి అంగనవాడి టీచర్స్ సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులుమరియు సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం నెలకి 18 వేల రూపాయలు వేతనం తక్షణమే అమలు చేయాలని అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫోన్ ద్వారా వ్యాపుని అప్డేట్ చేయాలని అదేవిధంగా అంగన్వాడి సెంటర్లకు సొంత భవనాలు నిర్మించాలని కాళీ ఉన్న అంగనవాడి హెల్పర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ సమావేశంలో అంగనవాడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గోనెమని సెక్టార్ లీడర్ రూప కమల సుగుణ శాంతి తదితరులు పాల్గొన్నారు*