

జన న్యూస్ ;3 ఆగస్టు ఆదివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
ప్రముఖ బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం రచించిన బాలకథా చంద్రిక బాలల కథలు పుస్తకావిష్కరణ ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో చందమామ కథా రచయిత మాచిరాజు కామేశ్వరరావు చేతుల మీదుగా జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ రచయితలు పైడిమర్రి రామకృష్ణ, చంద్రప్రతాప్, ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, బూర్ల నాగేశ్వరావు, పుప్పాల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఉండ్రాళ్ళ రాజేశం బాలల కోసం గేయాలు, కథలు, పద్యాలు తదితర ప్రక్రియల రచనలతో బాలసాహిత్య కృషిని కొనియాడారు.