

జనం న్యూస్ ఆగస్టు 4 అమలాపురం
అయినవిల్లి మండల బీజేపీ కార్యకర్తల సమావేశం కుడుపూడి చంద్ర శేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల నూతన అధ్యక్షులుగా యనమదల వెంకటరమణ ను బూత్ కమిటీ అధ్యక్షులు, క్రియాశీలక సభ్యులు, నాయకులు ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారని ఎన్నికల పరిశీలకులు మాలే శ్రీనివాస్ నగేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ నూతన అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఆర్వో చీకరుమిల్లి శ్రీనివాసరావు, ఏఆర్వో చీకురుమేల్లి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రతినిధులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు ఆకుమర్తి బేబీ రాణి, యనమదల రాజ్యలక్ష్మి, ఓబీసీ రాష్ట్ర నాయకులు కొప్పనాతి శ్రీరామచంద్రమూర్తి, జిల్లా సెక్రటరీ మోకా ఆదిలక్ష్మి, సీనియర్ నాయకులు ముద్రగడ రామకృష్ణ, వేటుకూరి సత్తిరాజు, అడపా వీరేశ్వర రావు, వేటుకూరి శ్రీనివాసరాజు, మిద్దె నూతన రవిరాజు, మొగలి దుర్గారావు, అల్లవరపు రవిశర్మ, వెలువలపల్లి సుబ్రమణ్య శర్మ, విలస దాసు, బుట్టే సత్తిబాబు పంపాటి నరేష్, సాద్విక్, పసలపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్న నూతన అధ్యక్షులు వెంకటరమణని మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ ని ఘనంగా దృస్సాలువతో సత్కరించారు.
