

జనంన్యూస్. 04.నిజామాబాదు.
పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు తెలంగాణ ట్రాన్స్కో మరియు డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్ మరియు బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., హాజరై ప్రారంభించడం జరిగింది.ముందుగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడం జరుగుతుందని ప్రతిరోజు కూడా వినియోగదారులతో పని ఒత్తిడికి లోనై ట్రాన్స్ఫార్మర్ ఫీజులు పోవడం, లైన్స్ సరి చేయడం, ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు విద్యుత్ పునరుద్ధరించడం. వివిధ పనుల్లో ప్రతినిత్యం నిమగ్నమైన మీకు ఇలాంటి క్రీడలతో మానసిక ఉల్లాసానికి ఉత్సాహంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడలు ప్రోత్సహిస్తున్నటువంటి మీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి అభినందనలు. ఇలాంటి క్రీడలు వల్ల ఉద్యోగ మధ్య తత్స సంబంధాలు ఏర్పడతాయని, దీంతో సౌభాతృత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా స్థానిక ఎస్ ఈ ఆపరేషన్ రాపల్లి రవీందర్ వహించారు, ఎస్ ఈ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల ట్రాన్స్కో డిస్కం హాకీ టోర్నమెంట్ విచ్చేసిన క్రీడాకారులకు స్వాగతం క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మన ఐక్యత మత్యాన్ని చాటాలని కోరారు.ఈ క్రీడలు రెండు రోజుల పాటు పోలీస్ పరిరక్షణలో జరగనున్నాయి. ఈ సందర్భంగా విద్యుత్ సౌదా జట్టు కెప్టెన్ శ్రీనివాస్ రెడ్డి అసిస్టెంట్స్ అకౌంట్ ఆఫీసర్ సామాజిక సేవా కార్యక్రమంలో కరోనా సమయంలో కార్యక్రమా పాల్గొన్నందుకు అమెరికన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొద్దున ఎందుకు కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అతిథులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఈ ఆపరేషన్ కామారెడ్డి శ్రావణ్ కుమార్ ,ఎస్ ఈ ఓఎంసీ పివి రావు, అడిషనల్ డిసిపి కే రామచంద్రరావు, రాష్ట్ర స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, డీ ఈ లు ఏ రమేష్, విక్రమ్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ఏడి ఈ తోట రాజశేఖర్ ఏ ఏ ఓ గంగారం నాయక్ జే ఏ ఓ సురేష్ కుమార్ ఏ డి ఈ ఆర్ బాలేష్ కుమార్ ,శంకర్ నాయక్ స్పోర్ట్స్ సెక్రెటరీ ఏ గోపి, పిఓ పోశెట్టి ,స్పోర్ట్స్ కౌన్సిల్ ఉత్తం, దినేష్, మూర్తి, సునీత, సీనయ్య, వివిధ సంఘాల నాయకులు రాజేందర్, పి గంగాధర్, చెన్నయ్య, ఐదు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు నిజామాబాద్ విద్యుత్ సౌదా నల్గొండ కరీంనగర్ వరంగల్ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.