

జుక్కల్ జూలై 4 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లీ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు షూ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
విద్యార్థులకు షూ డొనేట్ చేసిన శివరాజ్ పటేల్ కి ధన్యవాదాలు తెలియజేశారు.విద్యార్థులను చూస్తుంటే దేశ భవిష్యత్ కళ్ల ముందు కనిపిస్తుందని అన్నారు.విద్యార్ధి దశ అతి ముఖ్యమైనదని, విద్యార్థులందరూ బాధ్యతగా విద్యను అభ్యసించాల్సిన అవసరం ఉందని చెప్పారు.వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తి పురోగతికి, సమాజం మరియు దేశ అభ్యున్నతికి విద్య ఎంతో తోడ్పడుతుందని తెలిపారు.విద్యార్థులకు ఎంతో శ్రద్ధ మరియు బాధ్యతతో పాఠాలు బోధిస్తూ వారి భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు..
పాఠశాలకు సంబంధించి ప్రహరీ గోడ, అదనపు తరగతి గదులు నిర్మిస్తామని,ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ప్రజా ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, గతంలో ఎన్నడూ లేని విధంగా పాఠశాలలు ప్రారంభించే నాటికే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.విద్యార్థులు పట్టుదలతో బాగా చదివి పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువారాలని కోరారు విద్యార్థులకు విద్యా బుద్ధులతో పాటు క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించే విధంగా వారిని తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.అదేవిధంగా గ్రామ పెద్దలు కూడా పాఠశాలలో చిన్న చిన్న సమస్యలు ఉంటే బాధ్యతగా ముందకు వచ్చి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.

