

జనం న్యూస్ ఆగస్టు 4 చిలిపి చెడు మండల ప్రతినిధి
వ్యవసాయంలో నూతనంగా వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అలవర్చుకోవాలని అప్పుడే రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక పంటల దిగుబడి పెరిగి అధిక ఆదాయం ఆదాయం పొందే అవకాశం ఉందని మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్ తెలిపారు ఈరోజు చిలిపిచేడ్ మండలం అజ్జమరి గ్రామంలో రైతులకు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ నానో యూరియా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి ప్రత్యేక రకమైన ద్రవరూపమైన ఎరువు ద్వారా మొక్కల యొక్క పత్రాల రంద్రాల ద్వారా పోషకాలు నేరుగా మొక్కలోకి వెళ్లడం ద్వారా పంటలు దిగుబడిపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో రైతులు మోతాదుకు మించి ముఖ్యంగా రసాయన ఎరువులు అయినటువంటి యూరియాను మోతాదుకు మించి వాడడం ద్వారా నేల కాలుష్యంతో పాటుగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి అదేవిధంగా సాంప్రదాయ పద్ధతిలో గుళికల రూపంలో వేసినటువంటి ఎరువుల్లో కేవలం 30 నుంచి 40% మాత్రమే పంట తీసుకోవడం జరుగుతుంది మిగతా ఎరువులు వృధాగా పోయే అవకాశం ఉంటుంది ఈ నానో టెక్నాలజీ ద్వారా తయారుచేసిన నానో యూరియా విధానంలో పత్ర రంధ్రాల ద్వారా నత్రజని ఎరువులు మొక్కలకు 70 నుంచి 80 శాతం సంగ్రహించడం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి రైతుకు పంట దిగుబడిలో మంచి ప్రభావం చూపుతుంది ముఖ్యంగా రైతుకు అతి తక్కువ ఖర్చుతో ఈ ద్రవరూప ఎరువులు వాడడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వ్యవసాయ శాఖ ద్వారా క్షేత్రస్థాయిలో విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్ గారితో పాటుగా రైతులు బాలరాజు, యాదయ్య , కృష్ణ తదితరులు పాల్గొన్నారు